నాలో నివసించే నా యేసయ్య-Telugu Lyrics 2020

నాలో నివసించే నా యేసయ్య-Telugu Lyrics 2020

పాడిన వారు : పాస్టర్ అబ్రహం గారు

నాలో నివసించే నా యేసయ్య
మనోహర సంపాద నీవేనయ్యా } 2
మారని మమతల మహనీయుడ } 2
కీర్తించి నిన్నే ఘనపరతునయ్య
మనసార నిన్నే ప్రేమింతునయ్య } 2               || కీర్తించి నిన్నే ||

మధురమైనది నీ స్నేహబంధం
మహిమగా నన్ను మార్చిన వైనం } 2
నీ చూపులే నన్ను కాచెను
నీ బాహువే నన్ను మోసేను } 2
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను                    || కీర్తించి నిన్నే ||

వినయ భావము ఘనతకు మూలము
నూతన జీవములో నడుపు మార్గం
నా విన్నపం విన్నవులే
అరుదేంచేనే నీ వరములే
ఏమని వర్ణింతును నీ కృపలను                    || కీర్తించి నిన్నే ||

మహిమ గలది నీ దివ్య రాజ్యం
తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం } 2
సియోనులో చేరాలనే
నా ఆశయం నెరవేర్చుము
యేసయ్య నిన్ను చూచి హర్షింతును } 2
భువినేలు రాజ నీ నా వందనం
దివినేలు రాజ వేలాది వందనం                   || కీర్తించి నిన్నే ||

 

Nallo Nivasinchey Na Yesayya-English Lyrics

Sung by : Pastor Abraham

Nallo Nivasinchey Na Yesayya
Manohara Sampadha Neveynayya
Marani Mamathalla Mahaneyuda } 2
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya } 2           || Nallo Nivasinchey ||

Madhuramainadhi Ne Sneha Bandham
Mahimaga Nanu Marchina Vainam } 2
Ne Chupulley Nanu Kachenu
Ne Bahuvey Nanu mosenu } 2
Yemichi Ne Runamu Ney Therchanu           || Keerthinchi Niney ||

Vinayabhavamu Ganathaku Mullam
Nuthana Jeevamullo Nadupu Margam } 2
Na Vinapam Vinavulley
Arudhinchelley Ne Varamulley } 2
Yemani Varninthu Ne Krupallanu                 || Keerthinchi Niney ||

Mahimagalladhi Ne Dhivya thejam
Thejovasulla Parishuda Swasthyam } 2
Siyonullo Cherallaney
Na Ashayam Neraverchumu } 2
Yesayya Ninu chuchi Harshinthuney
Bhuvinellu Raja Nekey Na Vandhanam
Dhivinellu Raja Velladhi Vandhanam}2       || Nallo Nivasinchey ||

Nallo Nivasinchey Na Yesayya……

 

Leave a comment