అతి పరిశుద్ధుడా-Telugu Lyrics 2023

అతి పరిశుద్ధుడా-Telugu Lyrics 2023

పాడిన వారు :- పాస్టర్ జాన్ వెస్లీ గారు
                      పాస్టర్ అబ్రహం గారు
                      పాస్టర్ రమేష్ గారు
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
                                                  ||అతి పరిశుద్ధుడా || 
సర్వోన్నతమైన స్థలముల యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడూ ఆశ్చర్యమే
ముందెన్నడూ చవి చూడని
సరిక్రొత్తదైన ప్రేమా మృతం  (2)
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణము తీరదు ఏనాటికీ (2)       ||అతి పరిశుద్ధుడా ||
సద్గుణ రాశి నీ జాడలను
నా ఎదుటే నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా  (2)
నాలోన ఏ మంచి చూశావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా  (2) ||అతి పరిశుద్ధుడా ||
సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనియ్యక
శోధనలెన్నో  ఎదిరించినను
నను సోలి పోనియ్యక
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసున్నావులె ప్రతి అడుగునా  (2)
నీవేగా యేసయ్య నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి  (2)    
  
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా

 

Atiparishuddhuda-English Lyrics

Sung by :- Pastor John Wesley
Pastor Abraham
Pastor Ramesh

Atiparishuddhuda Stutinaivedyamu
Neeke Arpinchi Keerthintunu
Neevu Naa Pakshamai Nanu Deevinchaga
Neevu Naa Thoduvai Nanu Nadipinchaga
Jeevintunu Neekosame
Ashrayamaina Naa Yesayya       ||Atiparishuddhuda||

Sarvonnatamaina Sthalamulayandu
Nee Mahima Vivarimpaga
Unnatamaina Nee Sankalpamu
Ennadu Ascharyame
Mundennadu Chavichudani  (2)
Sarikrottadaina Premamrutam
Neelone Dachavu Eenatikai
Nee Runam Thiradu Enatiki  (2)       ||Atiparishuddhuda||

Sadgunarashi Nee Jadalanu
Naa Yeduta Nunchukoni
Gadichina Kaalam Sagina Payanam
Nee Krupaku Sanketame
Krupavembadi Kripapondaga
Maranu Madhuramuga Ne Pondaga  (2)
Nalona A Manchi Chusavayya
Niprema Chupitivi Naa Yesayya  (2) ||Atiparishuddhuda||

Sarepainunna Pathraga
Nannu Chejariponivvaka
Shodhanalenno Edirinchinanu
Nanu Soliponivvaka
Unnavule Pratikshanamuna
Kalisunnavule Prathi aduguna (2)
Neevega Yesayya Naa Oopiri
Neevega Yesayya Naa Kapari (2)

Atiparishuddhuda Stutinaivedyamu
Neeke Arpinchi Keerthintunu
Neevu Naa Pakshamai Nanu Deevinchaga
Neevu Naa Thoduvai Nanu Nadipinchaga
Jeevintunu Neekosame
Ashrayamaina Naa Yesayya

Atiparishuddhuda Stutinaivedyamu

2 thoughts on “అతి పరిశుద్ధుడా-Telugu Lyrics 2023”

Leave a comment